వైసీపీకి చిత్తశుద్ధి లేదన్న పవన్
దిశ వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అంశం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌కు బీజేపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఈ బంద్ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ బంద్‌కు జనసేన మద్దతు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. […]
దిశ వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అంశం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌కు బీజేపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఈ బంద్ ప్రశాంతంగా ముగిసింది.
అయితే ఈ బంద్‌కు జనసేన మద్దతు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీలో మాట్లాడేందుకు వైసీపీ భయపడుతోందని ఆరోపించారు.
ముున్సిపల్ ఎన్నికల కోసమే విశాఖలో వైసీపీ నిరసన స్టంట్లు అని ఆరోపించిన పవన్ కల్యాణ్.. వైసీపీ ఎంపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.