వరద ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నదికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ తగిన చర్యలను చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గోదావరికి వరద ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంటుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. ఎగువన భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి, వైద్య, ఆరోగ్య […]

Update: 2020-08-16 09:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నదికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ తగిన చర్యలను చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గోదావరికి వరద ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంటుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. ఎగువన భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి, వైద్య, ఆరోగ్య వసతులు కల్పించాలని అన్నారు.

Tags:    

Similar News