తిరుపతి ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి: పవన్
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఉపఎన్నికను జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని గ్రాండ్ రిట్జ్ హోటల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీజేపీతో కలిసి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రెండు పార్టీలు నిర్ణయించిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి అవసరమైన ఎత్తుగడల గురించి చర్చించారు. తొలుత పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో […]
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఉపఎన్నికను జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని గ్రాండ్ రిట్జ్ హోటల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీజేపీతో కలిసి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రెండు పార్టీలు నిర్ణయించిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి అవసరమైన ఎత్తుగడల గురించి చర్చించారు. తొలుత పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుపతి చేరారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.