విజయసాయి ఇంటికి రూ. 307 కోట్లు: పట్టాభిరామ్
దిశ, ఏపీ బ్యూరో: అంబులెన్స్‌లు రోడ్డు మీద వెళ్తుంటే విజయసాయిరెడ్డి ఇంటికి 307 కోట్ల రూపాయలు తరలిపోయినట్టు అనిపించిందని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏ1, ఏ2 బంధం బలపర్చుకునేందుకు విజయసాయిరెడ్డి పుట్టిన రోజును ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా నిర్వహించారని అన్నారు. తామడిగిని ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్లకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. 2020 వరకు బీవీజీ కాంట్రాక్ట్ అమల్లో ఉండగా, ఏ కారణంతో […]
దిశ, ఏపీ బ్యూరో: అంబులెన్స్‌లు రోడ్డు మీద వెళ్తుంటే విజయసాయిరెడ్డి ఇంటికి 307 కోట్ల రూపాయలు తరలిపోయినట్టు అనిపించిందని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏ1, ఏ2 బంధం బలపర్చుకునేందుకు విజయసాయిరెడ్డి పుట్టిన రోజును ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా నిర్వహించారని అన్నారు. తామడిగిని ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్లకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. 2020 వరకు బీవీజీ కాంట్రాక్ట్ అమల్లో ఉండగా, ఏ కారణంతో వారిని తప్పించారని పట్టాభి ప్రశ్నించారు. అరబిందో సంస్థకి అంబులెన్స్ నిర్వహణ కట్టబెట్టేందుకు జ్యూడిషియల్ రివ్యూలో క్లాజ్ ఎందుకు మార్చారని ఆయన అడిగారు. అలాగే ఈ అంబులెన్సుల్లో 46 పరికరాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తోందని చెప్పారు. అన్ని పరికరాలు కొనుగోలు చేసి అరబిందో ఫౌండేషన్‌కు ఇచ్చి, ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు 1.60 లక్షల రూపాయలు ఎందుకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేవలం నాలుగైదు రకాల టెస్టుల కోసం విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన సంస్థకు రూ. 307 కోట్లు దోచిపెడుతున్నారని ఆయన విమర్శించారు.