ఆసుపత్రుల్లో తగ్గుతున్న కరోనా పేషెంట్లు

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న కరోనా పేషెంట్ల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్సల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 55,442 బెడ్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం వీటిల్లో 18,366 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. వ్యాధి నుంచి కోలుకొని పేషెంట్లు అధికంగా డిశ్చార్జ్ అవుతుండటంతో ఖాళీగా 37,076 బెడ్లు ఖాళీ అయ్యాయి. జిల్లా ఆసుపత్రుల్లో దాదాపుగా సగానికి పైగా పేషెంట్ల సంఖ్య తగ్గిపోగా నగరంలో ప్రత్యేకంగా కోవిడ్ చికిత్సలందిస్తున్న గాంధీ, టిమ్స్, […]

Update: 2021-05-30 12:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న కరోనా పేషెంట్ల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్సల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 55,442 బెడ్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం వీటిల్లో 18,366 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. వ్యాధి నుంచి కోలుకొని పేషెంట్లు అధికంగా డిశ్చార్జ్ అవుతుండటంతో ఖాళీగా 37,076 బెడ్లు ఖాళీ అయ్యాయి. జిల్లా ఆసుపత్రుల్లో దాదాపుగా సగానికి పైగా పేషెంట్ల సంఖ్య తగ్గిపోగా నగరంలో ప్రత్యేకంగా కోవిడ్ చికిత్సలందిస్తున్న గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి ఆసుపత్రుల్లోనే పేషెంట్ల సంఖ్య అధికంగానే ఉంది.

గత 15 రోజుల క్రితం కరోనా వ్యాధి విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పూర్తిగా పేషెంట్లతో నిండిపోయాయి. ప్రభుత్వం ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లకోసం అడ్మిషన్ ఫీజులే రూ.లక్షల్లో చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకరు డిశ్చార్జ్ అవుతేనే లేకపోతే చనిపోతేనే మరొకరికి బెడ్ దొరికే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కరోనా వ్యాధి నుంచి కోలుకొని పేషెంట్లు డిశ్చార్జ్ అవుతుండటం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో బెడ్ల ఖాళీ అవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 55,442 బెడ్ల ఏర్పాటు

కరోనా చికిత్సల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 55,442 బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో వీటిలో ప్రస్తుతం 18,366 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. వ్యాధి నుంచి కోలుకొని పేషెంట్లు అధికంగా డిశ్చార్జ్ అవుతుండటంతో ఆసుపత్రుల్లో 37,076 బెడ్లు ఖాళీ అయ్యాయి. జనరల్ చికిత్సల కోసం 21,846 బెడ్లు ఏర్పాటు చేయగా వీటిలో 3,291 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతుండగా 18,555 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్లను 21,751 ఏర్పాటు చేయగా వీటిలో 9,200 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతుండగా 12,551 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఐసీయూ బెడ్లను 11,845 ఏర్పాటు చేయగా వీటిలో 5,875 మంది చికిత్సలు పొందుతుండగా 5,970 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

జిల్లా ఆసుపత్రుల్లో సగానికపైగా బెడ్లు ఖాళీ

జిల్లాలోని పెద్దాసుపత్రుల్లో సగానికి పైగా బెడ్లు ఖాళీ అయ్యాయి. మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లా ప్రభుత్వా ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు మాత్రమే పూర్తిగా పేషెంట్లతో నిండిపోయాయి. మిగతా అన్ని జిల్లాల పెద్దాసుపత్రుల్లో చాలా వరకు బెడ్లు ఖాళీ అయ్యాయి.
-ఆదిలాబాద్ రిమ్స్ లో జనరల్ బెడ్లు 150 ఏర్పాటు చేయగా 138 ఖాళీ, ఆక్సిజన్ బెడ్లు 295 ఏర్పాటు చేయగా 271 ఖాళీ, ఐసీయూ బెడ్లు 105 ఏర్పాటు చేయగా 101 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
– కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో 61 జనరల్ బెడ్లు ఏర్పాటు చేయగా 54 బెడ్లు ఖాళీ, ఆక్సిజన్ బెడ్లు 195 ఏర్పాటు చేయగా 73 ఖాళీ, ఐసీయూ 33 బెడ్లు ఏర్పాటు చేయగా 13 బెడ్లు ఖాళీగా ఉన్నాయి,
-ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో 20 జనరల్ బెడ్లు ఏర్పాటు చేయగా 13 ఖాళీ, ఆక్సిజన్ బెడ్లు 250 ఏర్పాటు చేయగా 20 బెడ్లు ఖాళీ, ఐసీయూ బెడ్లు 50 ఏర్పాటు చేయగా పూర్తిగా పేషెంట్లతో నిండిపోయాయి.
-మహాబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రుల్లో 270 బెడ్లు ఏర్పాటు చేయగా 259 బెడ్లు ఖాళీ, ఆక్సిజన్ బెడ్లు 170 ఏర్పాటు చేయగా 168 బెడ్లు ఖాళీ, ఐసీయూ బెడ్లు 60 ఏర్పాటు చేయగా పూర్తిగా నిండిపోయాయి.
– మెదక్ జిల్లా ఆసుపత్రిలో 40 జనరల్ బెడ్లు ఏర్పాటు చేయగా 30 బెడ్లు ఖాళీ, ఆక్సిజన్ బెడ్లు 92 ఏర్పాటు చేయగా 55 బెడ్లు ఖాళీ, ఐసీయూ బెడ్లు 8ఏర్పాటు చేయగా 2 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
– నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో 110 జనరల్ బెడ్లు ఏర్పాటు చేయగా 99 ఖాళీ, ఆక్సిజన్ బెడ్లు 321 ఏర్పాటు చేయగా 237 బెడ్లు ఖాళీ, ఐసీయూ బెడ్లు 90 ఏర్పాటు చేయగా 52 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
– వరంగల్ ఎంజీఎంలో 410 జనరల్ బెడ్లు ఏర్పాటు చేయగా 410 ఖాళీ, ఆక్సిజన్ బెడ్లు 680 ఏర్పాటు చేయగా 290 బెడ్లు ఖాళీ, ఐసీయూ బెడ్లు 80ఏర్పాటు చేయగా 53 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

నగరంలో ఆక్జిజన్, ఐసీయూ బెడ్లలో పేషెంట్లు

హైదరాబాద్ ప్రత్యేకంగా కోవిడ్ చికిత్సలందిస్తున్న గాంథీ, కింగ్ కోఠీ, టిమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్, ఐసీయూలో మాత్రమే అధికంగా పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు, మిగతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50శాతం అన్ని క్యాటగిరీల బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
– గాంధీ ఆసుపత్రిలో 650 జనరల్ బెడ్లు ఏర్పాటు చేయగా వీటిలో 48 మంది చికిత్సలు పొందుతుండగా 602 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 600 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయగా వీటిలో 450 మంది చికిత్సలు పొందుతుండగా 150 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఐసీయూ బెడ్లను 619 ఏర్పాటు చేయగా మొత్తం పూర్తిగా పేషెంట్లతో నిండి ఉన్నాయి.
-కింగ్ కోఠి ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లను 300 ఏర్పాటు చేయగా వీటిలో 180 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. 120 బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఐసీయూ బెడ్లను 50 ఏర్పాటు చేయగా వీటిలో 45 మంది చికిత్సలు పొందుతుండగా 5 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
-టిమ్స్ ఆసుపత్రిలో 800 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయగా 325 మంది చికిత్సలు పొందుతుండగా 518 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఐసీయూలో 137 బెడ్లు ఏర్పాటు చేయా 121 మంది చికిత్సలు పొందుతుండగా 16 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

Tags:    

Similar News