వంద అడుగుల దూరంలో ఆసుపత్రి.. అంతలోనే

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. సాయంత్రం ఆసుపత్రి ప్రధాన గేట్ ఎదుట సుమారు (45) ఏండ్ల వయసు గల వ్యక్తి పడిపోగా అతడికి వైరస్ పీడితుడు అనే అనుమానంతో ఎవ్వరూ అతడిని ఆసుపత్రికి తరలించే సాహసం చేయలేదు. వంద అడుగులు దూరంలో జనరల్ ఆసుపత్రి క్యాజువాలిటీ ఉన్న వైద్య సిబ్బంది కనికరించలేదు. అదే సమయంలో భారీ వర్షం పడటంతో అభాగ్యుడు […]

Update: 2020-08-02 10:22 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. సాయంత్రం ఆసుపత్రి ప్రధాన గేట్ ఎదుట సుమారు (45) ఏండ్ల వయసు గల వ్యక్తి పడిపోగా అతడికి వైరస్ పీడితుడు అనే అనుమానంతో ఎవ్వరూ అతడిని ఆసుపత్రికి తరలించే సాహసం చేయలేదు.

వంద అడుగులు దూరంలో జనరల్ ఆసుపత్రి క్యాజువాలిటీ ఉన్న వైద్య సిబ్బంది కనికరించలేదు. అదే సమయంలో భారీ వర్షం పడటంతో అభాగ్యుడు అలానే ప్రాణాలు వదిలాడు. కనీసం ఎవరైనా కనికరం చూపిన అతడు బతికే వాడు. ఆసుపత్రి రెండోగేట్ వద్ద నాలుగు గంటలు పడి ఉన్నా అతడిని ఆసుపత్రి సిబ్బంది కానీ, సెక్యూరిటీ సిబ్బంది గుర్తించినా ప్రాణాలు నిలిచేవి.

స్థానికంగా ఆటో ట్రాలీలకు సంబంధించిన వ్యక్తి సమాచారం అందించడంతో 108 అంబులెన్సు అయినా గుర్తు తెలియని వ్యక్తిని ఆసుపత్రికి తరలించేదుకు ఆసక్తి చూపలేదు. దీంతో నాలుగు గంటల పాటు గేట్ వద్ద ఉన్న అనాథ శవాన్ని మార్చురీకి తరలించామని ఇంచార్జి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ తెలిపారు. వైరస్ కారణంగా ప్రజలు తమలో మానవత్వం మరిచారనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని పలువురు అంటున్నారు.

Tags:    

Similar News