నీళ్ల కోసం రోడ్డెక్కారు

దిశ, మెదక్: గత వారం రోజుల నుంచి ఆ గ్రామానికి నీటి సరఫరా బందైంది. నీటిని విడుదల చేయాలంటూ గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పస్తాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యేకు ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు. దీంతో అధికారులు […]

Update: 2020-05-26 08:03 GMT

దిశ, మెదక్: గత వారం రోజుల నుంచి ఆ గ్రామానికి నీటి సరఫరా బందైంది. నీటిని విడుదల చేయాలంటూ గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పస్తాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది.

ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యేకు ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు. దీంతో అధికారులు హుటాహుటిన పస్తాపూర్ చేరుకున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

Tags:    

Similar News