అన్ని రకాల పాస్‌పోర్టు సేవలు నిలిపివేత..

దిశ ప్రతినిధి , హైదరాబాద్  : కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వరకు అన్ని రకాల పాస్ పోర్ట్ సేవలు నిలిపి వేస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్ జీఓ 102 ప్రకారం సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పీఎ‌స్ కె , పీఎస్ ఎల్కే, ఆర్పీఓ సేవలు […]

Update: 2021-05-14 08:16 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వరకు అన్ని రకాల పాస్ పోర్ట్ సేవలు నిలిపి వేస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్ జీఓ 102 ప్రకారం సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పీఎ‌స్ కె , పీఎస్ ఎల్కే, ఆర్పీఓ సేవలు నిలిపి వేసినట్లు తెలిపారు. అయితే కార్యాలయంలో పనిచేసే సిబ్బంది రోటేషన్ పద్ధతిన విధులకు హాజరు కావలసి ఉంటుందని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం పద్దతిన పని చేయవలసి ఉంటుందన్నారు.

పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు లాక్‌డౌన్ సమయంలో అత్యవసర ప్రయాణాలు చేయవలసి వస్తే వారు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలోని పాస్‌పోర్ట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సెంటర్ (పీఏపీసీ)లో ఈ నెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు అన్ని పని దినాల్లో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సంప్రదించవచ్చని ఆయన సూచించారు. వీరు www.passportindia.gov.in లో లేదా సేవా మొబైల్ యాప్ ద్వారా పాస్ట పోర్ట్ సేవా కేంద్రాస్ ( సీఎస్కే) అపాయింట్ మెంట్ పొందవచ్చని తెలిపారు . పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సూచించిన ఫీజును చెల్లించిన అనంతరమే వారి దరఖాస్తులను పరిశీలించబడతాయని ఆయన వివరించారు. అయితే లాక్ డౌన్ సమయంలోనూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు కార్యాలయం యథావిధిగా పని చేస్తుందని దాసరి బాలయ్య వెల్లడించారు .

Tags:    

Similar News