రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు…
దిశ వెబ్ డెస్క్: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో తొలిసారిగా జరగనుండ టంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీలందరికీ 72 గంటల ముందే కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. నెగెటివ్ గా తేలిన వారికి సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారు. అయితే 24 మంది ఎంపీలకు, 8మంది కేంద్ర మంత్రులకు కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం. కాగా టెస్ట్ కు సంబంధించిన పత్రాలు ఉన్న వారినే సభలోకి అనుమతించనున్నట్టు లోక్ సభ స్పీకర్ […]
దిశ వెబ్ డెస్క్:
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో తొలిసారిగా జరగనుండ టంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీలందరికీ 72 గంటల ముందే కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. నెగెటివ్ గా తేలిన వారికి సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారు. అయితే 24 మంది ఎంపీలకు, 8మంది కేంద్ర మంత్రులకు కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం. కాగా టెస్ట్ కు సంబంధించిన పత్రాలు ఉన్న వారినే సభలోకి అనుమతించనున్నట్టు లోక్ సభ స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక పార్లమెంట్ సమావేశాల నిర్వాహణ కోసం రాజ్యసభ చైర్మన్,లోక్ సభ స్పీకర్లు ట్రయల్ రన్స్ నిర్వహించారు. కాగా మొదటి రోజు ఉదయం లోక్ సభ, మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి ఉదయం11 గంటల నుంచి రాజ్యసభ, మధ్యాహ్న 2గంటల నుంచి లోక్ సభ సమావేశాలను నిర్వహించనున్నారు.