భార్యను చంపిన భర్త.. శవాన్ని ఇంటి ముందు ఉంచిన తల్లి దండ్రులు
దిశ, కోదాడ: మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా మహిళలపై దాడులు అత్యాచారాలు ఆగడం లేదు. ఇందుకు నిదర్శనం కోదాడ మండలం శ్రీ రంగాపురంలో భర్త వరకట్న వేధింపులకు ఓ మహిళ బలైపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే కేతేపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన చిత్తం వీరభద్రయ్య విజయ దంపతుల కుమార్తె శృతిని ఆరేళ్ల కిందట కోదాడ మండలం శ్రీరంగాపురంకి చెందిన చిత్తలూరి వెంకన్న లక్ష్మమ్మల కుమారుడు నరేష్ కిచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు […]
దిశ, కోదాడ: మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా మహిళలపై దాడులు అత్యాచారాలు ఆగడం లేదు. ఇందుకు నిదర్శనం కోదాడ మండలం శ్రీ రంగాపురంలో భర్త వరకట్న వేధింపులకు ఓ మహిళ బలైపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే కేతేపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన చిత్తం వీరభద్రయ్య విజయ దంపతుల కుమార్తె శృతిని ఆరేళ్ల కిందట కోదాడ మండలం శ్రీరంగాపురంకి చెందిన చిత్తలూరి వెంకన్న లక్ష్మమ్మల కుమారుడు నరేష్ కిచ్చి వివాహం చేశారు.
వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉద్యోగరీత్యా నరేష్ యానాంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. అక్కడే ఉంటున్న ఈ దంపతుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. నరేష్ ఇతర స్త్రీలతో అక్రమ సంబంధం కలిగి ఉండడమే కాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తూ మూడు రోజుల క్రితం తన భార్య శృతి పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మృతదేహాన్ని కోదాడ మండలం శ్రీ రంగాపురం అత్తవారింటి ముందు ఉంచి న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహిస్తున్నారు. తమ కుమార్తెను చంపిన నరేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.