అధిక ఫీజుల వసూలు.. స్కూల్ గేట్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని తల్లిదండ్రులు స్కూల్ గేటు ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఫీజులు కడితేనే హాల్ టికెట్స్ ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థులను పరీక్షలు రాయనీయకుండా మానసిక ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. లాక్‌డౌన్‌లో స్కూల్ మూసి ఉన్నప్పటికీ ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. అంతేగాకుండా.. దోపిడీకి పాల్పడుతోన్న జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని […]
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని తల్లిదండ్రులు స్కూల్ గేటు ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఫీజులు కడితేనే హాల్ టికెట్స్ ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థులను పరీక్షలు రాయనీయకుండా మానసిక ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. లాక్‌డౌన్‌లో స్కూల్ మూసి ఉన్నప్పటికీ ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. అంతేగాకుండా.. దోపిడీకి పాల్పడుతోన్న జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు.