పాపం చిట్టితల్లి.. నీ వాళ్లే నిన్ను భారమనుకున్నారా..?
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఓ మహిళ సభ్యసమాజం తలదించుకునే పని చేసింది. ఆమె చేసిన ఆ పని వల్ల మిగతా మహిళలకు తలవంపును తీసుకొచ్చింది. తల్లి కావడానికి ముందు తాను కూడా ఓ మహిళే అని విషయాన్ని మర్చిపోవడం వల్లే ఇంతటి దారుణానికి పాల్పడిందని పలువురు అనుకుంటున్నారు. అప్పుడే పుట్టిన పసి గుడ్డును తల్లి వదిలేసి పోయిన ఆ మహిళ అమ్మతనానికే మాయని మచ్చలా నిలిచిందని విమర్శిస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ […]
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఓ మహిళ సభ్యసమాజం తలదించుకునే పని చేసింది. ఆమె చేసిన ఆ పని వల్ల మిగతా మహిళలకు తలవంపును తీసుకొచ్చింది. తల్లి కావడానికి ముందు తాను కూడా ఓ మహిళే అని విషయాన్ని మర్చిపోవడం వల్లే ఇంతటి దారుణానికి పాల్పడిందని పలువురు అనుకుంటున్నారు. అప్పుడే పుట్టిన పసి గుడ్డును తల్లి వదిలేసి పోయిన ఆ మహిళ అమ్మతనానికే మాయని మచ్చలా నిలిచిందని విమర్శిస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బురుగుపాడులో సోమవారం వెలుగుచూసింది.
ముక్కుపచ్చలారని శిశువును బురుగుపాడులోని దర్గా శివారులో స్థానికులు గుర్తించారు. చిన్నారి ఏడుపు విని దగ్గరి వెళ్లిన కొందరు పరిశీలించగా నెలలు నిండని శిశువు కనిపించింది. ఆడపిల్ల పుట్టినందువల్ల లేదా పోషించే స్థోమత లేని కారణంగా తల్లిదండ్రులు ఆ చిన్నారిని వదిలేసి వెళ్లిపోయి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.