బిగ్ బ్రేకింగ్ : ప్రగతి భవన్‌ను తాకిన ‘పరకాల’ సెగ..

దిశ, ఖైరతాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలని అమరవీరుల జిల్లా సాధన సమితి మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించింది. సుమారు 20 సమితి సభ్యులు ప్రగతి భవన్ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ప్రగతిభవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరకాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని […]

Update: 2021-08-03 03:52 GMT

దిశ, ఖైరతాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలని అమరవీరుల జిల్లా సాధన సమితి మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించింది. సుమారు 20 సమితి సభ్యులు ప్రగతి భవన్ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ప్రగతిభవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరకాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News