ఆఫ్ఘన్‌లో మొదలైన యుద్ధం.. పంజ్ షీర్ రెబల్స్ VS తాలిబన్లు

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లో మరో యుద్ధం ప్రారంభమైంది. పంజ్ షీర్ మరియు తాలిబన్లకు మధ్య భీకర పోరు నడుస్తోంది. పంజ్ షీర్ ప్రాంతంలో తమ జెండా పాతాలని తాలిబన్లు ఉవ్విళ్లూరుతుండగా.. వారికి అక్కడి రెబల్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశపౌరులు అక్కడి నుంచి విదేశాలకు శరణార్థులుగా వెళ్లేందుకు అమెరికా, బ్రిటన్ ఆర్మీ సాయం కోరుతున్నారు. భారత వైమానిక దళం సైతం కాబూల్ ఎయిర్ పోర్టులో దేశ పౌరులను సురక్షితంగా […]

Update: 2021-08-23 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లో మరో యుద్ధం ప్రారంభమైంది. పంజ్ షీర్ మరియు తాలిబన్లకు మధ్య భీకర పోరు నడుస్తోంది. పంజ్ షీర్ ప్రాంతంలో తమ జెండా పాతాలని తాలిబన్లు ఉవ్విళ్లూరుతుండగా.. వారికి అక్కడి రెబల్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశపౌరులు అక్కడి నుంచి విదేశాలకు శరణార్థులుగా వెళ్లేందుకు అమెరికా, బ్రిటన్ ఆర్మీ సాయం కోరుతున్నారు. భారత వైమానిక దళం సైతం కాబూల్ ఎయిర్ పోర్టులో దేశ పౌరులను సురక్షితంగా తరలించడానికి చర్యలు చేపట్టింది. అయితే, పౌరులు దేశాన్ని వీడకుండా తాలిబన్లు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వారిపై కాల్పులు జరుపుతున్నారు. లూటీలు చేస్తున్నారు.

అమెరికా దళాలు వెనక్కి తగ్గిన కొద్దిరోజుల్లోనే ఆఫ్ఘన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు పంజ్ షీర్ ప్రాంతంపై మాత్రం పట్టుసాధించలేకపోయారు. అందుకు కారణం పంజ్ షీర్ రెబల్స్ తాలిబన్లకు చుక్కలు చూపించడమే. ఆ ప్రాంతంలోకి తాలిబన్లను అడుగుపెట్టనివ్వకుండా బాంబులు, తుపాకులతో విరుచుపడుతున్నారు. దీంతో ‘పంజ్ షీర్ వర్సెస్ తాలిబన్లు’గా అక్కడి వాతావరణం మారిపోయింది. పంజ్ షీర్ ఎంట్రన్స్ దగ్గరకు చేరుకున్న తాలిబన్లను ఆ ప్రాంతంలో అడుగుపెట్టకుండా సలాంగ్ హైవేను రెబల్ ఆర్మీ మూసివేసింది. తాలిబన్ల పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని అహ్మద్ మసౌద్, అమృల్లా సలేహ్ వెల్లడించారు. అంతేకాకుండా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆఫ్ఘన్ ఆర్మీ తాలిబన్లపై పోరు కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇన్నిరోజులు ప్రజాస్వామ్య పాలనలో ఉన్న ఆఫ్ఘన్‌ ప్రజలు.. తాలిబన్ల రాకతో మరోసారి అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది.

Tags:    

Similar News