మళ్లీ పెరిగిన కేసులు.. థర్డ్ వేవ్‌పై భయాందోళనలు
ముంబయి: ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో అత్యధిక కేసులు నమోదు చేసిన మహారాష్ట్రలో మంగళవారం మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కన్నా మంగళవారం నాటి కేసులు 1200 కేసులు అధికంగా రిపోర్ట్ అయ్యాయి. సోమవారం 6270 కేసులు నమోదవ్వగా, మంగళవారం 8470 కేసులు రిపోర్ట్ నమోదయ్యాయి. దీంతో థర్డ్ వేవ్‌పై భయాందోళనలు వెలువడ్డాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు చాలా వరకు సడలించడంతో ప్రజలు పెద్దపెట్టున బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడుతున్నారు. అన్‌లాక్ ప్రక్రియతో ప్రజలు ఎక్కువగా బయటకు వస్తున్నారని, రాష్ట్రంలో […]
ముంబయి: ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో అత్యధిక కేసులు నమోదు చేసిన మహారాష్ట్రలో మంగళవారం మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కన్నా మంగళవారం నాటి కేసులు 1200 కేసులు అధికంగా రిపోర్ట్ అయ్యాయి. సోమవారం 6270 కేసులు నమోదవ్వగా, మంగళవారం 8470 కేసులు రిపోర్ట్ నమోదయ్యాయి. దీంతో థర్డ్ వేవ్‌పై భయాందోళనలు వెలువడ్డాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు చాలా వరకు సడలించడంతో ప్రజలు పెద్దపెట్టున బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడుతున్నారు.
అన్‌లాక్ ప్రక్రియతో ప్రజలు ఎక్కువగా బయటకు వస్తున్నారని, రాష్ట్రంలో థర్డ్ వేవ్ అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చే ముప్పు ఉన్నదని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ హెచ్చరించింది. సాధారణంగా రెండు వేవ్‌ల మధ్య 100 నుంచి 120 రోజుల గ్యాప్ ఉంటుందని ఎక్స్‌పర్ట్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రాహుల్ పండిట్ పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో 14 నుంచి 15 వారాల తేడాతో విరుచుకుపడ్డాయని, కొన్ని దేశాల్లో రెండు నెలల తేడాతో కొత్త వేవ్‌లు వచ్చాయని వివరించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు