సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు చెప్పలేని గిరాకీ!
కరోనా పాండమిక్ కారణంగా ప్రపంచం మొత్తం ఆన్‌లైన్ చుట్టూ తిరుగుతోంది. కానీ దేశంలో అందరి దగ్గరా స్మార్ట్‌ఫోన్‌లు ఉండవు కదా.. పైగా ఇప్పుడు విద్య కూడా ఆన్‌లైన్‌లోనే అవడంతో కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. వేలకు వేలు పోసి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడం కంటే, ఉన్నంతలో సర్దుబాటు చేసుకుని పాత సెకండ్ హ్యాండ్ ఫోన్ దొరుకుతుందేమోనని చూస్తున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు చెప్పలేని గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా టైర్-3, టైర్-4 నగరాల్లో ఈ డిమాండ్ ఎక్కువగా […]
కరోనా పాండమిక్ కారణంగా ప్రపంచం మొత్తం ఆన్‌లైన్ చుట్టూ తిరుగుతోంది. కానీ దేశంలో అందరి దగ్గరా స్మార్ట్‌ఫోన్‌లు ఉండవు కదా.. పైగా ఇప్పుడు విద్య కూడా ఆన్‌లైన్‌లోనే అవడంతో కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. వేలకు వేలు పోసి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడం కంటే, ఉన్నంతలో సర్దుబాటు చేసుకుని పాత సెకండ్ హ్యాండ్ ఫోన్ దొరుకుతుందేమోనని చూస్తున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు చెప్పలేని గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా టైర్-3, టైర్-4 నగరాల్లో ఈ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆన్‌లైన్ క్లాసుల కోసం పిల్లలకు తమ స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం కంటే, వారికి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు అనుకోవడమే ఇందుకు కారణమని క్యాషిఫై సీఈవో మన్‌దీప్ మనోచా అంటున్నారు.
సాధారణంగా మామూలు సమయాల్లో 20 శాతం ఉండే సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ బిజినెస్.. ఈ పాండమిక్ సమయంలో 35 శాతం పెరిగిందని మన్‌దీప్ అన్నారు. ఇక ఓఎల్ఎక్స్ లాంటి ప్రముఖ సెకండ్ హ్యాండ్ సేల్స్ యాప్‌లో ఏకంగా 109 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి, వారి ఫోన్ ద్వారా హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఒక స్మార్ట్‌ఫోన్ అవసరమవుతోంది. ఇలాంటి వారు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనడానికే మొగ్గు చూపడంతో మే, జూన్ నెలల్లో వీటి డిమాండ్ 71 శాతానికి పెరిగినట్లు మనోచాల తెలిపారు. ఇక కరోనా అప్‌డేట్స్ కోసం, ఆరోగ్య సేతు లాంటి ప్రభుత్వాలు విడుదల చేసే యాప్‌లను వాడుకోవడానికి వీలుగా ఫీచర్ ఫోన్‌ను కాదని స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ముందుకు వస్తున్నారని ప్రముఖ రీసెర్చి సంస్థ కౌంటర్‌పాయింట్ అనలిస్ట్ వరుణ్ మిశ్రా వెల్లడించారు.