కార్యదర్శులకు సెలవులు రద్దు..

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ కార్యదర్శుల సెలవులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇకమీదట ఎవరూ సెలవులు పెట్టొద్దని, అందరూ విధులకు హాజరు కావాలని పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. ఆన్‌లైన్ ఆస్తుల నమోదులో కొందరు ఒక్క ఎంట్రీ కూడా చేయనట్లు గుర్తించామన్నారు. నెలకు రూ.15 వేల జీతం చెల్లిస్తూ తమతో ఎన్నో పనులు చేయించుకుంటున్నారని కార్యదర్శులు అసహనంతో ఉన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ లాంటి యాభైకు పైగా పనుల వలన తమపై ఒత్తిడి పెరుగుతోందని […]

Update: 2020-10-04 23:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ కార్యదర్శుల సెలవులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇకమీదట ఎవరూ సెలవులు పెట్టొద్దని, అందరూ విధులకు హాజరు కావాలని పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.

ఆన్‌లైన్ ఆస్తుల నమోదులో కొందరు ఒక్క ఎంట్రీ కూడా చేయనట్లు గుర్తించామన్నారు. నెలకు రూ.15 వేల జీతం చెల్లిస్తూ తమతో ఎన్నో పనులు చేయించుకుంటున్నారని కార్యదర్శులు అసహనంతో ఉన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ లాంటి యాభైకు పైగా పనుల వలన తమపై ఒత్తిడి పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News