పక్క ఊరోళ్లకు కల్లు పోసినందుకు ఫైన్
దిశ, వరంగల్: కరోనా వైరస్ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహమ్మారి నివారణకు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామాలు స్వీయ నిర్బంధం పాటించాయి. గ్రామస్తులు పొలిమేరల్లో ముళ్లకంచెలు ఏర్పాటు చేసుకుని తాము ఏ ఊరికి వెళ్ళకుండా ఇతరులు తమ ఊరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బాంజీపేటకు చెందిన పగిడిపల్లి […]
దిశ, వరంగల్:
కరోనా వైరస్ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహమ్మారి నివారణకు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామాలు స్వీయ నిర్బంధం పాటించాయి. గ్రామస్తులు పొలిమేరల్లో ముళ్లకంచెలు ఏర్పాటు చేసుకుని తాము ఏ ఊరికి వెళ్ళకుండా ఇతరులు తమ ఊరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బాంజీపేటకు చెందిన పగిడిపల్లి ఐలయ్యగౌడ్ గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. కల్లు విక్రయిస్తే గానీ ఇల్లు గడవదు. శనివారం ఆయన ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారికి కల్లు విక్రయించాడు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బంది ఆయనకు రూ.1500 జరిమానా విధించారు. ఎందుకని ప్రశ్నిస్తే పక్క ఊరి వాళ్లకు కల్లు అమ్మినందున జరిమానా విధించామని రసీదు చేతిలో పెట్టారు. ఈ చర్యను గీత కార్మికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags: Panchayat staff, fine, liquor, neighboring village, warangal, Rs 500