అక్రమ నిర్మాణాలపై పంచాయతీ అధికారుల కొరడా

దిశ, పటాన్‌చెరు: అక్రమ లేఅవుట్, నిర్మాణాలపై జిల్లా పంచాయతీ అధికారులు కొరడా ఝులిపించారు. పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ శివారులో సర్వే నెంబర్ 702 నుంచి 710 వరకు సుమారు 100 ఎకరాలలో హెచ్ఎండీఏ నుంచి గాని, గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు చేశారు. అంతేగాకుండా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని సంగారెడ్డి జిల్లా ఉపపంచాయతీ అధికారి సతీష్ రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు […]

Update: 2020-07-30 10:37 GMT

దిశ, పటాన్‌చెరు: అక్రమ లేఅవుట్, నిర్మాణాలపై జిల్లా పంచాయతీ అధికారులు కొరడా ఝులిపించారు. పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ శివారులో సర్వే నెంబర్ 702 నుంచి 710 వరకు సుమారు 100 ఎకరాలలో హెచ్ఎండీఏ నుంచి గాని, గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు చేశారు. అంతేగాకుండా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని సంగారెడ్డి జిల్లా ఉపపంచాయతీ అధికారి సతీష్ రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ స్క్యాడ్ సాయంతో జిల్లా పంచాయతీ అధికారులు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో వాటిని కూల్చివేయడం జరిగిందన్నారు. హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు, నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు లేని లే అవుట్లలో ప్రజలు ఎలాంటి కొనుగోళ్లు చేయరాదని సూచించారు. అనుమతి లేని లేఅవుట్, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయనన్నారు.

Tags:    

Similar News