‘రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ సాగు’

దిశ, అశ్వారావుపేట : రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తీర్ణం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో గురువారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల రైతులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ముందుగా వరంగల్ నుండి సత్తుపల్లి చేరుకున్న ఆయన తర్వాత దమ్మపేట […]

Update: 2021-08-05 11:55 GMT

దిశ, అశ్వారావుపేట : రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తీర్ణం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో గురువారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల రైతులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ముందుగా వరంగల్ నుండి సత్తుపల్లి చేరుకున్న ఆయన తర్వాత దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో సాగుతున్న పామాయిల్ పంటను ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన రైతులతో పరిశీలించి, అనంతరం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పామాయిల్ సాగులో ఎటువంటి పద్ధతులు పాటించాలి, పామాయిల్ దిగుబడి సంవత్సరంలో ఏ నెలల్లో అధికంగా వస్తుందన్నారు.

పామాయిల్ పంటకు ఎలాంటి ఎరువులు వాడాలి అనే అంశాలపై సంబంధిత అధికారులతో అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి నుండి అశ్వారావుపేట మండలం నారవారిగూడెం గ్రామంలో ఉన్న పామాయిల్ నర్సరీని ఆయన సందర్శించారు. పామాయిల్ మొక్కలు ఎలా తయారవుతున్న విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలు, బిందు సేద్య పరికరాలకు ఇస్తుందని తెలిపారు. అక్కడ నుండి దమ్మపేట మండలం మందలపల్లిల్లో పామాయిల్ పంటలో అంతర పంటగా సాగుతున్న అరటి పంటను చూసి ఆనందం వ్యక్తం చేశారు. పామాయిల్ లో అంతర్ పంట వేయడం ద్వారా ఇంకా అధిక దిగుబడులు సాధించుకోవచ్చని తెలిపారు. అనంతరం అక్కడి నుండి దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ కర్మాగారంలో వరంగల్ రైతులతో కలిసి ఆయన ఫ్యాక్టరీని సందర్శించారు. పంటను రైతులు పామాయిల్ ఫ్యాక్టరీ ఎలా తరలిస్తున్నారు… తీసుకువచ్చిన పామాయిల్ గెలలు ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, టన్నుకు నూనె దిగుబడి ఎంత వస్తుంది అనే అంశంపై అడిగి తెలుసుకున్నారు. అశ్వారావుపేట పామాయిల్ రైతులు దేశానికే ఆదర్శమని తెలిపారు.

వివిధ కార్యక్రమలలో నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట, దమ్మపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, సోయం ప్రసాద్ జడ్పీటీసీలు పైడి వెంకటేశ్వరరావు, చిన్నంశెట్టి వరలక్ష్మి, పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్లు బాలకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, పామాయిల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రాప్రసాద్, జారే ఆదినారాయణ, బండి పుల్లారావు, రెడ్డిమళ్ళ వెంకటేశ్వరావు, కొయ్యల అచ్యుతరావు, బండారు శ్రీను, సర్పంచ్లు అట్టం రమ్య, నారం రాధ, టిఆర్ఎస్ నాయకులు దొడ్డ రమేష్, షేక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News