ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకుంటా: పల్లా రాజేశ్వర్ రెడ్డి

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప‌ల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల సమస్యలపై అవ‌గాహ‌న లేని వారే త‌న‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో లక్షా 32వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన‌ట్లుగా ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ఆయా శాఖ‌ల్లో భ‌ర్తీ చేసిన విధానాన్ని పల్లా వివ‌రించారు. తాను చెప్పిన దాంట్లో అబద్ధాలుంటే వెంట‌నే ‘ఎమ్మెల్సీ బ‌రి నుంచి త‌ప్పుకుంటాన‌ని’ చాలెంజ్ […]

Update: 2021-02-27 07:35 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప‌ల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల సమస్యలపై అవ‌గాహ‌న లేని వారే త‌న‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో లక్షా 32వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన‌ట్లుగా ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ఆయా శాఖ‌ల్లో భ‌ర్తీ చేసిన విధానాన్ని పల్లా వివ‌రించారు. తాను చెప్పిన దాంట్లో అబద్ధాలుంటే వెంట‌నే ‘ఎమ్మెల్సీ బ‌రి నుంచి త‌ప్పుకుంటాన‌ని’ చాలెంజ్ చేశారు. శ‌నివారం వ‌రంగ‌ల్ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జ‌రిగిన మీట్ ది ప్రెస్‌ పల్లా మాట్లాడుతూ.. ప్రభుత్వం చేప‌ట్టిన సంక్షేమ, అభివృద్ధి ప‌నుల‌పై ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం కారణంగానే బయ్యారం ఉక్కు పరిశ్రమ, సైనిక్ స్కూల్, ఎయిర్‌పోర్టు వంటి సమస్యలకు పరిష్కారం లభించలేదని చెప్పారు.

Tags:    

Similar News