జర్నలిస్టులకు డబుల్ గుడ్ న్యూస్: జనవరిలో అక్రిడిటేషన్ కార్డ్స్.. ఆ తర్వాత ఇళ్ల స్థలాలు

జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

Update: 2024-11-18 10:09 GMT

దిశ, వెబ్ డెస్క్: జర్నలిస్టుల(Journalists)కు కూటమి ప్రభుత్వం(Coalition Government) గుడ్ న్యూస్ తెలిపింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు(Accreditation cards), ఇళ్ల స్థలాల(Houses)పై కీలక ప్రకన చేసింది. జనవరి నెలలో కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు ఐఅండ్‌పీఆర్ కసరత్తులు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) తెలిపారు. ఫస్ట్ కొత్త అక్రిడేషన్ కార్డులు ఇస్తామని, ఆ త్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు.


అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ నెలలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజధాని జర్నలిస్టు‌లకు అక్కడే ఇస్తామని, హెచ్ఐజీ, ఎంఐజీ ఇచ్చే‌ అంశమే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన సలహాలు లిఖితపూర్వకంగా ఎవరైనా ఇస్తే పరిశీలిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News