పాకిస్థానీ మోడల్‌పై ఆ మతస్తుల ఆగ్రహం.. అలా చేసేంత ధైర్యముందా అంటూ..
దిశ, సినిమా: పాకిస్థాన్ మోడల్ సౌలేహ ఒట్టి తమ మతాచారాన్ని కించపరిచిందంటూ ఆ దేశ సిక్కులు మండిపడుతున్నారు. విషయానికొస్తే.. సిక్కులకు పవిత్ర స్థలమైన పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లిన సదరు మోడల్.. తలను చున్నీతో కప్పుకోకుండా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా వైరల్‌గా మారిన ఆమె ఫొటోలు చూసిన సిక్కు మతస్తులు.. తమ మనోభావాలు దెబ్బతీసిందంటూ సౌలేహపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మతస్థలంలో కూడా ఇలాగే చేసేంత ధైర్యం ఉందా? […]
దిశ, సినిమా: పాకిస్థాన్ మోడల్ సౌలేహ ఒట్టి తమ మతాచారాన్ని కించపరిచిందంటూ ఆ దేశ సిక్కులు మండిపడుతున్నారు. విషయానికొస్తే.. సిక్కులకు పవిత్ర స్థలమైన పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లిన సదరు మోడల్.. తలను చున్నీతో కప్పుకోకుండా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా వైరల్‌గా మారిన ఆమె ఫొటోలు చూసిన సిక్కు మతస్తులు.. తమ మనోభావాలు దెబ్బతీసిందంటూ సౌలేహపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మతస్థలంలో కూడా ఇలాగే చేసేంత ధైర్యం ఉందా? కర్తార్‌పూర్ సాహిబ్ ఏమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటుందా? అని మండిపడ్డారు.
అంతేకాదు ప్రభుత్వం వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ ఫొటోలు డిలీట్ చేసిన సౌలేహ.. ‘నేను సిక్కుల చరిత్ర తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లానే తప్ప, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదు. మీ సంస్కృతిని అగౌరవపరిచానని భావిస్తే క్షమించండి. ఇకపై ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాను’ అని క్షమాపణలు కోరింది.