బీసీసీఐ వెనుక మేం పరుగెత్తం : ఎహసాన్ మణి

దిశ, స్పోర్ట్స్: పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ ఆడమని బీసీసీఐ వెనుక పరుగెత్తమని, వాళ్లకు ఇష్టమైన‌ప్పుడే ఆడనని పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌ల కోసం గతంలో మాదిరిగా అడగమని చెప్పారు. ఒక పాడ్ కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడిన ఎహసాన్ మణి పలు విషయాలపై చర్చించారు. ‘2003లో నేను ఐసీసీ చైర్మన్‌గా వ్యవహరించాను. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలపడటం కోసం భారత మంత్రులతో చర్చించాను. […]

Update: 2020-07-24 11:39 GMT

దిశ, స్పోర్ట్స్: పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ ఆడమని బీసీసీఐ వెనుక పరుగెత్తమని, వాళ్లకు ఇష్టమైన‌ప్పుడే ఆడనని పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌ల కోసం గతంలో మాదిరిగా అడగమని చెప్పారు. ఒక పాడ్ కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడిన ఎహసాన్ మణి పలు విషయాలపై చర్చించారు. ‘2003లో నేను ఐసీసీ చైర్మన్‌గా వ్యవహరించాను. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలపడటం కోసం భారత మంత్రులతో చర్చించాను. నేను ఐసీసీ పదవి చేపట్టిన తర్వాత ముంబయిలో ఒకసారి సమావేశం జరిగింది. ఇండో, పాక్ క్రికెట్ గురించి ప్రస్తావిస్తే వారి నుంచి సరైన సమాధానం లభించలేదు. ఈ విషయమై బీసీసీఐ వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు’ అని మణి పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ల వల్ల ప్రపంచ క్రికెట్‌కు మేలు జరుగుతుందని కొన్నాళ్ల క్రితం మణి వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags:    

Similar News