పాక్ చానెల్ హ్యాక్.. భారత జెండా ప్రత్యక్షం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ న్యూస్ చానెల్ ‘డాన్ టీవీ’ హ్యాక్ అయింది. కమర్షియల్ యాడ్స్ వస్తున్న సమయంలో ఆ చానెల్‌లో భారత జాతీయ జెండా ప్రత్యక్షమైంది. ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ సందేశం కనిపించింది. జెండాతోపాటు ఈ సందేశం కొంతకాలం అలాగే డిస్‌ప్లే అయింది. కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో విరివిగా చర్చసాగింది. ఆ సందేశం, జెండా చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు డాన్ న్యూస్ తెలిపింది. దర్యాప్తు ముగిసిన తర్వాత ప్రేక్షకులకు వివరాలు […]
న్యూఢిల్లీ: పాకిస్తాన్ న్యూస్ చానెల్ ‘డాన్ టీవీ’ హ్యాక్ అయింది. కమర్షియల్ యాడ్స్ వస్తున్న సమయంలో ఆ చానెల్‌లో భారత జాతీయ జెండా ప్రత్యక్షమైంది. ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ సందేశం కనిపించింది. జెండాతోపాటు ఈ సందేశం కొంతకాలం అలాగే డిస్‌ప్లే అయింది.
కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో విరివిగా చర్చసాగింది. ఆ సందేశం, జెండా చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు డాన్ న్యూస్ తెలిపింది. దర్యాప్తు ముగిసిన తర్వాత ప్రేక్షకులకు వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. పీవోకే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ వెబ్‌సైట్ గతనెలలో హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఆ వెబ్‌సైట్‌లో ఇమ్రాన్ ఖాన్ సర్కారు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని ఓ మెస్సేజ్ పోస్ట్ అయింది.