కవ్విస్తోన్న పాక్

భారత్ చేతిలో ఎన్నిమార్లు దెబ్బలు తిన్న పాకిస్తాన్‌ తన తీరును మార్చుకోవడం లేదు. ఓ వైపు తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ను వైద్య పరంగా ఎదుర్కొనే సత్తా కూడా ఆ దేశానికి కూడా లేదు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ అందులోనుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ, సరిహద్దుల్లో భారత సైన్యాన్ని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది. ఇరుదేశాలు చేసుకున్నకాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. గురువారం పూంచ్ సెక్టార్‌లోని […]

Update: 2020-03-19 01:11 GMT

భారత్ చేతిలో ఎన్నిమార్లు దెబ్బలు తిన్న పాకిస్తాన్‌ తన తీరును మార్చుకోవడం లేదు. ఓ వైపు తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ను వైద్య పరంగా ఎదుర్కొనే సత్తా కూడా ఆ దేశానికి కూడా లేదు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ అందులోనుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ, సరిహద్దుల్లో భారత సైన్యాన్ని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది. ఇరుదేశాలు చేసుకున్నకాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. గురువారం పూంచ్ సెక్టార్‌లోని దేగ్వార్ సెక్టార్‌లో కాల్పులకు తెగబడింది. మోర్టార్ షెల్లింగ్ ద్వారా కాల్పులు జరుపుతుండటంతో అప్రమత్తమైన భారత సైన్యం వారిని సమర్ధవంతంగా తిప్పికొడుతోంది.
Tags: indian army, pak army, voilote firing agreement, firing with mortor shells, defending bharth

Tags:    

Similar News