వాటితో ముస్తాబైన వెరైటీ వినాయకుడు.. ఎక్కడంటే ?
దిశ, ఉత్తరాంధ్ర : విశాఖ జిల్లా పాడేరు ఉపసర్పంచ్, కిరాణా వ్యాపారైన బూరెడ్డి రామునాయుడు రూ. 35వేలతో వినూత్నంగా కిరాణా వినాయకుని విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని సామలు, రాగులు, ధాన్యం, పప్పు దినుసులు, జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్, ఎండుద్రాక్ష, యాలకలు, లవంగా, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను వినియోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి నవరాత్రులు పూజలు నిర్వహిస్తామని రామునాయుడు తెలిపారు. ఈ విగ్రహం గురించి తెలుసుకున్న స్థానికులు వినాయకుడిని దర్శించుకునేందుకు […]
దిశ, ఉత్తరాంధ్ర : విశాఖ జిల్లా పాడేరు ఉపసర్పంచ్, కిరాణా వ్యాపారైన బూరెడ్డి రామునాయుడు రూ. 35వేలతో వినూత్నంగా కిరాణా వినాయకుని విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని సామలు, రాగులు, ధాన్యం, పప్పు దినుసులు, జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్, ఎండుద్రాక్ష, యాలకలు, లవంగా, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను వినియోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి నవరాత్రులు పూజలు నిర్వహిస్తామని రామునాయుడు తెలిపారు. ఈ విగ్రహం గురించి తెలుసుకున్న స్థానికులు వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.