Pig Fight Competition: అక్కడ పందుల పోటీలు.. పండక్కి స్పెషల్ అట్రాక్షన్‌గా.. ఆ జిల్లాలో మామూలుగా లేదుగా సందడీ!
ఎలాంటి ప్రాణహాని లేకుండా జరిగే ఈ ఆట అందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తుందని అక్కడి వారు చెబుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి అనగానే మనకీ ముందు గుర్తొచ్చేది కోడి పందేలు. ఎందుకంటే ప్రతీ జిల్లాలో ఈ పందేలను నిర్వహిస్తారు. కత్తి కట్టుకుని పుంజులు బరిలోకి దిగితే కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. అయితే, ఇప్పటి వరకు మనం కోడి పందేలు, ఎడ్ల పోటీలను చూసాము. ఇప్పుడు, దీనికి భిన్నంగా గోదావరి జిల్లాలో పందుల పోటీలు నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు. పందులని రెండు టీమ్స్ గా చేసి.. ఇరువైపులా నుంచి ఒకేసారి పందులను వదులుతారు.. అలా తలపడగా చివరికీ ఏది నిలబడుతుందో దాన్ని విన్నర్ గా ప్రకటిస్తారు. పందుల పోటీలు వినడానికి కొత్తగా ఉండటంతో .. వాటిని చూడటానికి జనం వెళ్తున్నారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఎలాంటి ప్రాణహాని లేకుండా జరిగే ఈ ఆట అందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తుందని అక్కడి వారు చెబుతున్నారు.