Trending: శ్రీవారి మొక్కు తీర్చుకున్న నితీశ్ రెడ్డి.. ఏం చేశాడంటే! (వీడియో వైరల్)

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)తో అరంగేట్రం చేసిన తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అరివీర భయకర ఆస్ట్రేలియా (Australia) జట్టుపై సెంచరీతో అదరగొట్టాడు.

Update: 2025-01-14 05:04 GMT
Trending: శ్రీవారి మొక్కు తీర్చుకున్న నితీశ్ రెడ్డి.. ఏం చేశాడంటే! (వీడియో వైరల్)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)తో అరంగేట్రం చేసిన తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అరివీర భయకర ఆస్ట్రేలియా (Australia) జట్టుపై సెంచరీతో అదరగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో టీ20 క్రికెట్ వైబ్ తీసుకొస్తూ.. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే, బోర్డర్-గవాస్కర్ సీరిస్ ముగిసిన నేపథ్యంలో తాజాగా, నితీశ్ తిరుమల (Tirumala) మెట్ల మార్గంలో శ్రీవారిని దర్శించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేశాడు.

అదేవిధంగా మోకాళ్ల పర్వతం వద్ద నితీశ్ మోకాళ్లపై మెట్టు ఎక్కి మొక్కును తీర్చుకుంటున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో విపరీతంగా వైరల్ అవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగి నితీశ్ నిలిచాడు.       

Tags:    

Similar News