Vijayanagaram: సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం
సంక్రాంతి(Sankranthi) పండుగ వేళ విజయనగరం జిల్లా(Vijayanagaram District)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి(Sankranthi) పండుగ వేళ విజయనగరం జిల్లా(Vijayanagaram District)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు యువకులు మృతి(Two People Died) చెందారు. బొండపల్లి మండలం గొట్లం గ్రామం వద్ద బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను లారీ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు.