కొవిడ్ ఎఫెక్ట్.. ప్రాణ భయమే అతనికి వ్యాపారం!
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ ట్రై సిటి పరిధిలో ఆక్సిజన్ ఫ్లోమీటర్లను అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుండి 12 ఫ్లో మీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫో ర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖుద్దుస్ కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్‌కు ఏర్పడ్డ డిమాండ్‌ను గుర్తించాడు. ఆక్సిజన్ సిలండర్లతో పాటు సిలిండర్లకు అవసరమైన […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ ట్రై సిటి పరిధిలో ఆక్సిజన్ ఫ్లోమీటర్లను అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుండి 12 ఫ్లో మీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫో ర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖుద్దుస్ కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్‌కు ఏర్పడ్డ డిమాండ్‌ను గుర్తించాడు.
ఆక్సిజన్ సిలండర్లతో పాటు సిలిండర్లకు అవసరమైన ఫ్లో మీటర్లు ప్రస్తుతం ఓపెన్ మార్కెట్‌లో అందుబాటులో లేకపోవడంతో ఇదే అదునుగా భావించి ఆక్సిజన్ ఫ్లో మీటర్లను ఇతర ప్రాంతాల నుండి రూ.1300/కొనుగోలు చేసి వరంగల్ నగరంలో అధిక ధరలకు అమ్మేందుకు ప్లాన్ చేశాడు. ఒక్క ఫ్లో మీటర్‌ను రూ. పదివేలకు బ్లాక్‌లో తన ఇంటిలో కరోనా వ్యాధిగ్రస్తుడి బంధువులకు అమ్ముతున్నట్లుగా టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిందితుడి ఇంటిపై పోలీసులు దాడి చేసి అతని నుంచి 12 ఫ్లో మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు స్వాధీనం చేసుకున్న ఫ్లో మీటర్లను పోలీసులకు అప్పగించారు.