అక్కడ ఆక్సిజన్ అందకే కరోనా రోగులు మరణించారు : కేంద్రం ప్రకటన
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించినట్లు కేంద్ర స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆక్సిజన్ అందక కొందరు చనిపోయారని ఏపీ ప్రభుత్వం వెల్లడించిందని తెలిపారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగిందని.. 10 కిలోలీటర్ల సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంక్ రీఫిల్లింగ్, బ్యాకప్ సరఫరాను అందుబాటులోకి తీసుకువస్తున్న సమయంలో ఈ ఘటన […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించినట్లు కేంద్ర స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆక్సిజన్ అందక కొందరు చనిపోయారని ఏపీ ప్రభుత్వం వెల్లడించిందని తెలిపారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగిందని.. 10 కిలోలీటర్ల సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంక్ రీఫిల్లింగ్, బ్యాకప్ సరఫరాను అందుబాటులోకి తీసుకువస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొందని తెలిపారు.
ఆక్సిజన్ సరఫరా ఆలస్యం అవ్వడంతో రోగులు ప్రాణాలు విడిచారని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఈ ఘటన ఈ ఏడాది మే నెలలో జరిగింది. 11 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక మరణించారు. ఇదిలా ఉంటే దేశంలో ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదని, ఒకే ఒక్క అనుమానిత కేసు మాత్రం నమోదైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ పీక్ టైమ్లో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని అయితే కరోనా బాధితులు ఎవరూ చనిపోలేదని పార్లమెంట్లో కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే.