భారత్‌కు అండగా నిలుస్తున్న ప్రపంచ దేశాలు

దిశ, వెబ్‌డెస్క్: కరోనాపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. దేశంలో ప్రధానంగా మెడికల్ ఎక్విప్‌మెంట్ కొరత ఉండడం వల్ల ఇప్పటికే పలు దేశాల నుంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వెంటిలేటర్స్‌ను విమానాల ద్వారా పంపిస్తున్నారు. తాజాగా సౌత్‌ కొరియా, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ కూడా భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ మూడు దేశాల నుంచి బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు భారీగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరుకు సాయం చేసేందుకు ముందుకు […]

Update: 2021-05-11 22:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనాపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. దేశంలో ప్రధానంగా మెడికల్ ఎక్విప్‌మెంట్ కొరత ఉండడం వల్ల ఇప్పటికే పలు దేశాల నుంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వెంటిలేటర్స్‌ను విమానాల ద్వారా పంపిస్తున్నారు. తాజాగా సౌత్‌ కొరియా, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ కూడా భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ మూడు దేశాల నుంచి బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు భారీగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరుకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న ప్రపంచ దేశాలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News