చంద్రబాబుకు సొంత ఇంటి నుంచే నిరసనలు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష టీడీపీలో తిరుగుబాటు మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండటం కలకలం రేపుతోంది. బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ పదవులకు నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నిర్ణయంపై మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు పోటీ చేయడంపై స్థానిక కేడర్ […]

Update: 2021-04-02 08:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష టీడీపీలో తిరుగుబాటు మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండటం కలకలం రేపుతోంది. బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ పదవులకు నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

చంద్రబాబు నిర్ణయంపై మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు పోటీ చేయడంపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని, పోటీలో గెలిచినా.. ఓడినా సిద్ధాంతాలను మాత్రం మరవొద్దన్నారు.

అటు, బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు. జగ్గంపేట ఇంచార్జ్‌గానే కొనసాగుతానని, ఎన్నికలను బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయాన్ని విబేధిస్తున్నాన్నారు.

Tags:    

Similar News