కరోనా పంజా: మూడు రోజుల్లో లక్షకుపైగా..

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపం చూపిస్తోంది. గత కొద్దిరోజులుగా సెకండ్ వేవ్ తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో కరోనా మనల్ని వదిలి ఇక వెళ్లదా?.. దీని ప్రభావం ఇలాగే కొనసాగుతుందా? అనే చర్చ జరుగుతోంది. దేశంలో గత మూడు రోజుల్లో ఏకంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా కొత్తగా 40,953 […]

Update: 2021-03-20 22:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపం చూపిస్తోంది. గత కొద్దిరోజులుగా సెకండ్ వేవ్ తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో కరోనా మనల్ని వదిలి ఇక వెళ్లదా?.. దీని ప్రభావం ఇలాగే కొనసాగుతుందా? అనే చర్చ జరుగుతోంది.

దేశంలో గత మూడు రోజుల్లో ఏకంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా కొత్తగా 40,953 కరోనా నమోదవ్వగా.. 188 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటితో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,88,394కి చేరుకుంది.

గత ఏడాది నవంబర్ తర్వాత ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని కేంద్రం ప్రకటించింది. 8 రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి పెరుగుతుందని, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లోనే 76.22 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయంది.

Tags:    

Similar News