ఆ రైళ్లలో 80 మంది చనిపోయారంటా!
న్యూఢిల్లీ: వలస కూలీలను తరలిస్తున్న శ్రామిక్ ట్రైన్‌లలో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారని రైల్వే అధికారులు వెల్లడించారు. మే 9వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో ఇంత మంది చనిపోయినట్టు తెలిపారు. మే 23న పది మంది, 24వ, 25వ తేదీల్లో తొమ్మిది మంది చొప్పున, 27న ఎనిమిది మంది, 26న 13 మంది మృతి చెందినట్టు వివరించారు. ఇందులో కరోనాతో మరణించింది ఒక్కరే కాగా, 11 మంది ఇతర వ్యాధులతో చనిపోయారని తెలిపారు. […]
న్యూఢిల్లీ: వలస కూలీలను తరలిస్తున్న శ్రామిక్ ట్రైన్‌లలో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారని రైల్వే అధికారులు వెల్లడించారు. మే 9వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో ఇంత మంది చనిపోయినట్టు తెలిపారు. మే 23న పది మంది, 24వ, 25వ తేదీల్లో తొమ్మిది మంది చొప్పున, 27న ఎనిమిది మంది, 26న 13 మంది మృతి చెందినట్టు వివరించారు. ఇందులో కరోనాతో మరణించింది ఒక్కరే కాగా, 11 మంది ఇతర వ్యాధులతో చనిపోయారని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా దేశంలో పలుప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు మే 1వ తేదీ నుంచి శ్రామిక్ ట్రైన్‌లు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.