ఉత్తరాఖండ్ వరదలు.. 203 మంది గల్లంతు : సీఎం రావత్

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ దౌలిగంగ ప్రకృతి విలయ తాండవంపై ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పందించారు. ధౌలిగంగా నదికి వరద పోటెత్తడంతో రేణీ గ్రామం వద్ద రుషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో ధౌలిగంగా నది వరదల్లో ఇప్పటివరకు 203 మంది గల్లంతయ్యారని సీఎం వెల్లడించారు. వారిలో 11 మంది మృతదేహాలను వెలికితీశామని వివరించారు. వరద ప్రాంతంలో నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తపోవన్ ప్రాజెక్ట్ కు సమీపంలో ఉన్న మరో సంస్థకు […]

Update: 2021-02-08 03:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ దౌలిగంగ ప్రకృతి విలయ తాండవంపై ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పందించారు. ధౌలిగంగా నదికి వరద పోటెత్తడంతో రేణీ గ్రామం వద్ద రుషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో ధౌలిగంగా నది వరదల్లో ఇప్పటివరకు 203 మంది గల్లంతయ్యారని సీఎం వెల్లడించారు. వారిలో 11 మంది మృతదేహాలను వెలికితీశామని వివరించారు. వరద ప్రాంతంలో నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తపోవన్ ప్రాజెక్ట్ కు సమీపంలో ఉన్న మరో సంస్థకు చెందిన సుమారు 25మంది పనిచేస్తున్నారని, వారి ఆచూకీ తెలియరాలేదని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు.

Tags:    

Similar News