‘అనాథలు లేని సమాజాన్ని నిర్మించడమే మా లక్ష్యం’
దిశ, తెలంగాణ బ్యూరో : అనాథలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నామని ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ సంస్థ వ్యవస్థాపకులు గాదె ఇన్నారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ సదస్సులు, వివిధ సమావేశాలు నిర్హహిస్తున్నామని పేర్కొన్నారు. అంతే కాకుండా అధికారులను, సంబంధిత మంత్రులను, పార్లమెంటు సభ్యులను, అన్ని పార్టీల లీడర్లను కలిసి దీని గురించి వారికి తెలియజేస్తున్నామన్నారు. ఎటువంటి గుర్తింపు, కులం, కనీసం చిరునామా తెలియని వారు […]
దిశ, తెలంగాణ బ్యూరో : అనాథలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నామని ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ సంస్థ వ్యవస్థాపకులు గాదె ఇన్నారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ సదస్సులు, వివిధ సమావేశాలు నిర్హహిస్తున్నామని పేర్కొన్నారు. అంతే కాకుండా అధికారులను, సంబంధిత మంత్రులను, పార్లమెంటు సభ్యులను, అన్ని పార్టీల లీడర్లను కలిసి దీని గురించి వారికి తెలియజేస్తున్నామన్నారు. ఎటువంటి గుర్తింపు, కులం, కనీసం చిరునామా తెలియని వారు దాదాపు 4 కోట్ల మంది ఉన్నారని వారు ఉపాధి, విద్య, వైద్యానికి దూరమవుతున్నారని మంత్రులకు, అధికారులకు తెలిపామన్నారు.
వీరికి న్యాయం చేసే విధంగా చట్టం రూపొందించాలని చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు ఆర్ఎస్ఎస్ సేవా భారతి ప్రెసిడెంట్ పన్నాలాల, న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజీజూని కలసి వారి గురించి వివరించామని, దానికి పన్నాలాల సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ ప్రెసిడెంట్ కర్ర యాదవ రెడ్డి, విఫర్ నీడీ సంస్థ వ్యవస్థాపకులు సామినేని నీరజ రాణి, వంశిధర్, ఫోర్స్ సభ్యులు కమఠం రజిత, పంజుగుల పూజ, కమఠం దీపిక, సిద్ధం విజేత, సిద్ధం శ్వేత, పెద్దమ్మ ప్రియాంక, కమఠం మౌనిక, చీకటి రవళి, గాదె కారుణ్య, గాదె మాధవి, తదితరులు పాల్గొన్నారు.