KCR కు దమ్ముంటే ఓయూకి వచ్చి విద్యార్థులతో చర్చించాలి: ఓయూ విద్యార్థి ఫైర్

ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు మీడియా సమావేశంలో నాయకుడు వలిగొండ నరసింహ అనే ఓయూ విద్యార్థి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Update: 2024-04-30 14:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు మీడియా సమావేశంలో నాయకుడు వలిగొండ నరసింహ అనే ఓయూ విద్యార్థి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఉస్మానియా యూనివర్సిటీ గురించి గానీ విద్యార్థి సంక్షేమం కోసం గానీ ఏనాడు మాట్లాడాని మాజీ సీఎం కల్వకుంట చంద్రశేఖర రావు నిన్న ఓ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, కరెంటు సమస్య ఉందని గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడు. దమ్ముంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి ఓయూతో సహా తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలలో సమస్యలు గురించి చర్చించడానికి కేసీఆర్ కు దమ్ముందా? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలను అవమానించేలా వ్యవహరించావు.

పదేళ్ల నీ పరిపాలనలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి, మేదో చర్చలు లేకుండా నిర్బంధాలు విధించి, ఎలాంటి నోటిఫికేషన్లు, నియామకాలు జరపకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేశావు. ఎలా మర్చిపోగలం విద్యార్థులకు నువ్వు చేసిన ద్రోహాన్ని. ఇప్పుడు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థి ప్రతిపక్షాన ఉంటూ మీ హయంలో నిలిచిపోయిన 30 వేల ఉద్యోగుల భర్తీ చేశారు. టీఎస్పీఎస్సి ప్రక్షాళన వంటి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు అండగా నిలిచారు.

రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రజా ప్రభుత్వం పై మీరు ఎన్ని రకాల అసత్య ప్రచారాలు జరిపిన, కుట్రలు పన్నినా మీ కుటుంబ కుట్రలను తిప్పి కొట్టి ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మెజార్టీ సీట్లు గెలిపించుకోవడం కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తామని’’ విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. అలాగే ఉస్మానియా యూనివర్సీటీలో ఏర్పడిన నీటి కొరత విద్యుత్ సమస్యలపై తక్షణమే స్పందించి విద్యార్థులకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు కృతజ్ఞతలు తెలియజేశారు. 


Similar News