రూ. 11 కోట్లకు యాపిల్-1 కంప్యూటర్
దిశ, ఫీచర్స్: ‘యాపిల్’ నుంచి ఓ ప్రొడక్ట్ వస్తుందంటే.. ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక ఐఫోన్ సిరీస్ నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు.. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుంటారు. యాపిల్ ప్రొడక్ట్స్‌కు ఉండే యూనిక్ స్టైల్, క్వాలిటీతో పాటు రీసేల్‌లో మంచి ధరకు అమ్ముడుపోవడమే అందుకు కారణం. కాగా టెక్ దిగ్గజం యాపిల్.. తొలినాళ్లలో తయారు చేసిన చెక్క కేసుతో కూడిన కంప్యూటర్‌ను ఓ నెటిజన్ తాజాగా ఈబేలో అమ్మకానికి పెట్టాడు. […]
దిశ, ఫీచర్స్: ‘యాపిల్’ నుంచి ఓ ప్రొడక్ట్ వస్తుందంటే.. ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక ఐఫోన్ సిరీస్ నుంచి కొత్త ఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు.. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుంటారు. యాపిల్ ప్రొడక్ట్స్‌కు ఉండే యూనిక్ స్టైల్, క్వాలిటీతో పాటు రీసేల్‌లో మంచి ధరకు అమ్ముడుపోవడమే అందుకు కారణం. కాగా టెక్ దిగ్గజం యాపిల్.. తొలినాళ్లలో తయారు చేసిన చెక్క కేసుతో కూడిన కంప్యూటర్‌ను ఓ నెటిజన్ తాజాగా ఈబేలో అమ్మకానికి పెట్టాడు. అయితే 1976లో ఈ ప్రొడక్ట్ అసలు ధర కంటే ప్రస్తుతం 2,250 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించనుండటం గమనార్హం.
యాపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి 1976లో యాపిల్-1 పేరుతో 200 కంప్యూటర్లను తయారుచేసి, మార్కెట్‌లో విడుదల చేశారు. వీటిలో మొత్తంగా 175 కంప్యూటర్లను 666.66 డాలర్ల ధర చొప్పున విక్రయించారు. ఆ తర్వాతి ఏడాదిలో వీటి రేటును 475 డాలర్లకు తగ్గించినా, అదే ఏడాది చివరినాటికి యాపిల్– ఐఐ అందుబాటులోకి రావడంతో యాపిల్–1 అమ్మకాలను నిలిపివేశారు. ఆ తర్వాతి కాలంలో ఈ కంప్యూటర్లలో చాలావరకు పాడైపోగా, కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతానికి కేవలం ఆరు కంప్యూటర్లకు మాత్రమే ఒరిజనల్ ఉడ్ కేసులు ఉండగా, అవి పలు మ్యూజియాల్లో ఉన్నాయి. ఈబే లిస్టింగ్ ప్రకారం 1978లో ఈ కంప్యూటర్‌ను కొనుగోలు చేసిన యూఎస్‌కు చెందిన కృష్ణ బ్లేక్.. పూర్తిస్థాయిలో పనిచేసే కంప్యూటర్ మోడల్‌ను దాని మాన్యువల్, క్యాసెట్ ఇంటర్‌ఫేస్‌తో విక్రయిస్తున్నారు. అరుదైన ప్రొడక్ట్ కావడంతో ఆయన దీన్ని రూ. 10,93,13,250(1.5 మిలియన్ డాలర్స్) ధరకు ఈబేలో అమ్మకానికి పెట్టాడు. ఇక వర్కింగ్ కండిషన్‌లో ఉన్న మరో యాపిల్ -1 మోడల్, చెక్క కేసు లేకుండా 2020లో బోస్టన్‌లో జరిగిన వేలంలో రూ. 3,34,38,839 ($458,711)విక్రయించారు. కాగా 2014లో మరో యాపిల్ -1 కంప్యూటర్‌ను రూ. 6,59,60,472కు వేలంలో విక్రయించారు. ఇప్పటివరకు వింటేజ్ యాపిల్ కంప్యూటర్స్‌లో ఇదే రికార్డ్ ధర కావడం విశేషం.
ఇది 8-బిట్ ఎంఓఎస్ (MOS) 6502 మైక్రోప్రాసెసర్‌ను కలిగి ఉండగా, 1 MHz రన్ చేస్తుంది. మెమొరీ పరంగా.. డిఫాల్ట్‌గా 4 కేబీ స్టోరేజ్ కలిగి ఉండగా, ఎక్స్‌పాన్షన్స్ కార్డ్స్ ఉపయోగించి 8KB లేదా 48KBకి పెంచుకోవచ్చు. కంప్యూటర్‌తో పాటు ఒరిజినల్ డిజిటల్ కాపీలు, మాన్యువల్స్, స్కీమాటిక్స్, బేసిక్ మాన్యువల్, క్యాసెట్ ఇంటర్‌ఫేస్, గైడ్స్ పొందవచ్చు.