టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదల
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరుగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వాహక కమిటీ, ఐఓసీ సమావేశమై కొత్త షెడ్యూల్ రూపొందించారు. 2021 జూలై 23న ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ముందే మహిళల సాఫ్ట్ బాల్, ఫుట్‌బాల్, పురుషుల ఫుట్‌బాల్, ఆర్చరీ పోటీలు మొదలవుతాయని నిర్వాహకులు చెప్పారు. జూలై 24 తర్వాత ఆరంభమయ్యే హాకీ పోటీలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. […]
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరుగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వాహక కమిటీ, ఐఓసీ సమావేశమై కొత్త షెడ్యూల్ రూపొందించారు. 2021 జూలై 23న ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ముందే మహిళల సాఫ్ట్ బాల్, ఫుట్‌బాల్, పురుషుల ఫుట్‌బాల్, ఆర్చరీ పోటీలు మొదలవుతాయని నిర్వాహకులు చెప్పారు. జూలై 24 తర్వాత ఆరంభమయ్యే హాకీ పోటీలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. భారత హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్నాయి. భారత్ జూలై 25న ఆస్ట్రేలియా, జూలై 27న స్పెయిన్, జూలై 29న ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, 30న జపాన్‌తో తలపడనుంది. ఒలింపిక్స్ కోసం 42 వేదికలను సిద్ధం చేసినట్లు ఐఓసీ శుక్రవారం ప్రకటించింది. 22న పురుషుల సాకర్, 23న ఆర్చరీ, రోయింగ్ పోటీలు మొదలవుతాయి. తొలి మెడల్ ఈవెంట్ జూలై 24న జరుగనుంది.