గ్యాస్ సిలిండర్‌తో అసెంబ్లీలోకి..
నిరసనలు, నినాదాలతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఉద్యోగాలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయటా లోపల ఆందోళనలు చేశారు. ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గ్యాస్ సిలిండర్‌లను అసెంబ్లీలోకి భుజాలపై మోసుకెళ్లి నిరసన తెలిపారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు ఆలుగడ్డలు, టమాటాలు సహా కూరగాయలను ముందుపెట్టుకుని బీజేపీ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ బయటా లోపల ప్లకార్డులు, నినాదాలు తప్పా […]
నిరసనలు, నినాదాలతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఉద్యోగాలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయటా లోపల ఆందోళనలు చేశారు. ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గ్యాస్ సిలిండర్‌లను అసెంబ్లీలోకి భుజాలపై మోసుకెళ్లి నిరసన తెలిపారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు ఆలుగడ్డలు, టమాటాలు సహా కూరగాయలను ముందుపెట్టుకుని బీజేపీ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ బయటా లోపల ప్లకార్డులు, నినాదాలు తప్పా ఏమీ కనిపించలేదు. ఈ రభసకు సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రేక్షకపాత్ర పోషించడం మినహా ఏమీ చేయలేకపోయారు.
రాష్ట్ర అసెంబ్లీలో గురువారం బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఇరుసభలను ఉద్దేశిస్తూ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మాట్లాడుతుండగానే ఈ నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యేలో హాల్ మధ్యలోకి దూసుకెళ్లి ఆందోళనలు చేశారు.