టీడీపీకి పేరు వస్తుందనే జగన్ అలా చేస్తున్నారు !

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో పనులు నిలిపివేయడం మొదటి ద్రోహంగా పేర్కొన్న చంద్రబాబు.. పోలవరం పనులను పిలిపివేయడం రెండో ద్రోహమన్నారు. ఈ రెండు పనులు తమ హయాంలో ప్రారంభించినందువల్ల టీడీపీకి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం 175అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ […]

Update: 2020-11-17 11:48 GMT

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో పనులు నిలిపివేయడం మొదటి ద్రోహంగా పేర్కొన్న చంద్రబాబు.. పోలవరం పనులను పిలిపివేయడం రెండో ద్రోహమన్నారు. ఈ రెండు పనులు తమ హయాంలో ప్రారంభించినందువల్ల టీడీపీకి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం 175అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీని ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. 25మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్.. ఇప్పుడేం చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News