ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్ : ఏపీ డీజీపీ
దిశ, ఏపీబ్యూరో : ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆపరేష్ ముస్కాన్’ విజయవంతమైందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముస్కాన్ కార్యక్రమం ఆరు విడతల్లో జరిగిందన్నారు. ఇందులో తొలి ఐదు విడతల్లో నిర్వహించిన ముస్కాన్ కార్యక్రమం ఒక ఎత్తైతే.. చివరి ఆరో కార్యక్రమం మరో ఎత్తుగా అభివర్ణించారు. ఆపరేషన్ ముస్కాన్ బృందం పని తీరును ఏపీ సీఎం అభినందించారని ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా వేలాది […]
దిశ, ఏపీబ్యూరో :
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆపరేష్ ముస్కాన్’ విజయవంతమైందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముస్కాన్ కార్యక్రమం ఆరు విడతల్లో జరిగిందన్నారు. ఇందులో తొలి ఐదు విడతల్లో నిర్వహించిన ముస్కాన్ కార్యక్రమం ఒక ఎత్తైతే.. చివరి ఆరో కార్యక్రమం మరో ఎత్తుగా అభివర్ణించారు. ఆపరేషన్ ముస్కాన్ బృందం పని తీరును ఏపీ సీఎం అభినందించారని ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా వేలాది మంది పిల్లలను రక్షించడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.
నాలుగేళ్ల పిల్లాడిని తల్లి దగ్గరకు చేర్చగలిగామని గుర్తుచేశారు. ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించామని, చాలా మందికి కరోనా కిట్లు కూడా అందజేశామన్నారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకొని పనిచేసిన సీఐడీ విభాగాన్ని డీజీపీ అభినందించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మొత్తం 4,806 మంది పిల్లలను కాపాడామని స్పష్టంచేశారు. బాల కార్మికులుగా ఉన్న 278 మంది పిల్లలకు ఈ ఆపరేషన్ ద్వారా విముక్తి కల్పించామన్నారు.
మొత్తం 4,806 మందిలో 4,075 మంది బాలురు, 731 మంది బాలికలు, ఇంకో 73 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని ఆయన చెప్పారు. వీరిలో చిరునామా ఉన్న 4,703 మంది వీధి బాలలను వారివారి తల్లిదండ్రులకు అప్పగించామని సవాంగ్ తెలిపారు. ఇందులో 1,121 మంది బాలలకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించామన్నారు. అనంతరం వారికి కరోనా కిట్లు అందజేసినట్టు వివరించారు. చట్టాలను అతిక్రమించి వీధి బాలలతో పనులు చేయిస్తున్న వారిపై 22 కేసులు పెట్టామని, మరో ఏడుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశానట్లు డీజీపీ తెలిపారు.