68 మందికి ఒక్కటే రేషన్ కార్డు.. ఎక్కడో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : 68 మంది సభ్యులతో కూడిన రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఉన్నారు. 68 మంది కుటుంబసభ్యులా అని ఆశ్చర్య పోతున్నారా.. కానీ 68 మంది సభ్యులతో కూడిన రేషన్ కార్డులో ఉన్నవాళ్లందరూ ఒకే కుటుంబ సభ్యులు కారు, ఒకే మతం వాళ్లు కాదు. అసలు వారు ఉన్నారో లేరో కూడా తెలీదు. ఈ ఫ్రాడ్ బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ వివరాలను […]
దిశ, వెబ్ డెస్క్ : 68 మంది సభ్యులతో కూడిన రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఉన్నారు. 68 మంది కుటుంబసభ్యులా అని ఆశ్చర్య పోతున్నారా.. కానీ 68 మంది సభ్యులతో కూడిన రేషన్ కార్డులో ఉన్నవాళ్లందరూ ఒకే కుటుంబ సభ్యులు కారు, ఒకే మతం వాళ్లు కాదు. అసలు వారు ఉన్నారో లేరో కూడా తెలీదు. ఈ ఫ్రాడ్ బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆసమయంలో ఒకే రేషన్ కార్డుపై రెగ్యులర్‌గా ఏకంగా 38క్వింటాళ్ల ధాన్యం ఇస్తున్నట్లు కనిపిచడంతో షాక్ అయిన అధికారులు స్థానిక రేషన్ డీలర్‌ని ప్రశ్నించారు. అనతరం ఎస్ డీ ఓ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్ సంజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.