ఆన్లైన్ వ్యభిచారం గుట్టురట్టు
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో ఆన్లైన్ వ్యభిచారం నడిపిస్తున్న మరో ముఠా గుట్టు రట్టయింది. సోషల్ మీడియాలో యువతుల ఫోటోలు పెట్టి బల్కంపేటలో వ్యభిచార గృహాం నడుపిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం..గుంటూరు జిల్లాకు చెందిన వంశీరెడ్డి.. విజయవాడకు చెందిన అంజలీ, చిన్నలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతాఇతర రాష్ట్రాలకు చెందిన యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బలవంతంగా బల్కంపేటలోని ఒక గృహంలో నిర్భందించారు.వారి ఫోటోలను […]
దిశ, వెబ్ డెస్క్ :
హైదరాబాద్‌లో ఆన్లైన్ వ్యభిచారం నడిపిస్తున్న మరో ముఠా గుట్టు రట్టయింది. సోషల్ మీడియాలో యువతుల ఫోటోలు పెట్టి బల్కంపేటలో వ్యభిచార గృహాం నడుపిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం..గుంటూరు జిల్లాకు చెందిన వంశీరెడ్డి.. విజయవాడకు చెందిన అంజలీ, చిన్నలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతాఇతర రాష్ట్రాలకు చెందిన యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బలవంతంగా బల్కంపేటలోని ఒక గృహంలో నిర్భందించారు.వారి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి విటులను ఆకర్షిస్తున్నారు.
వారి నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో వంశీరెడ్డి నలుగురు యువతులను తీసుకుని నాగారం రాంపల్లి చౌరస్తాకు వచ్చినట్లు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముఠాచేతిలో బంధీలుగా ఉన్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు, విజయవాడకు చెందిన ఓ యువతిని కాపాడినట్లు తెలిపారు. నిర్వాహకుల్లో అంజలి, ఆమె సహాయకుడు చిన్న పరారీలో ఉన్నట్లు తేలింది.ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.