రైతు బజార్లలో రూ.40కే ఉల్లిపాయలు

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లిపాయలు అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని స్వరాజ్​మైదానం రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాన్ని ప్రారంభించారు. ఉల్లి ధరల పెంపును దృష్టిలో ఉంచుకొని సీఎం ​జగన్ రెండ్రోజుల క్రితమే ఉల్లిపాయల సేకరణకు ఆదేశాలిచ్చారని, ఈ నేపథ్యంలో మహారాష్ర్ట, ఇతర ప్రాంతాల నుంచి 6వేల క్వింటాళ్లను తెప్పించినట్లు పేర్కొన్నారు. ఇంకా అందుబాటులో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని తీసుకొస్తామన్నారు. శనివారం నుంచి అన్ని రైతు బజార్లలో సబ్సిడీపై […]

Update: 2020-10-23 11:49 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లిపాయలు అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని స్వరాజ్​మైదానం రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాన్ని ప్రారంభించారు. ఉల్లి ధరల పెంపును దృష్టిలో ఉంచుకొని సీఎం ​జగన్ రెండ్రోజుల క్రితమే ఉల్లిపాయల సేకరణకు ఆదేశాలిచ్చారని, ఈ నేపథ్యంలో మహారాష్ర్ట, ఇతర ప్రాంతాల నుంచి 6వేల క్వింటాళ్లను తెప్పించినట్లు పేర్కొన్నారు. ఇంకా అందుబాటులో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని తీసుకొస్తామన్నారు. శనివారం నుంచి అన్ని రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్​ కారణంగా మొత్తం 110 రైతుబజార్లను వికేంద్రీకరించి 450కి పెంచినట్లు తెలిపారు.

Tags:    

Similar News