‘దేశంలోనే ది బెస్ట్ మార్కెట్ యార్డుగా మార్చుతా’
దిశ, మెదక్: నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డల మార్కెట్ సముదాయాన్ని నిరంజన్ రెడ్డి, మంత్రి హరీష్ రావులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్‌చెరు మార్కెట్ యార్డు పద్నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. ఇది మహానగర అవసరాలను కూడా తీర్చే విధంగా రూపుదిద్దుతామన్నారు. ఒక […]
దిశ, మెదక్: నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డల మార్కెట్ సముదాయాన్ని నిరంజన్ రెడ్డి, మంత్రి హరీష్ రావులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్‌చెరు మార్కెట్ యార్డు పద్నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. ఇది మహానగర అవసరాలను కూడా తీర్చే విధంగా రూపుదిద్దుతామన్నారు. ఒక కన్సల్టెంట్స్‌తో దేశవ్యాప్తంగా అధ్యాయనం చేయించి ది బెస్ట్ మార్కెట్ యార్డుగా మల్చుదామన్నారు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ రైతుల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిరంజన్ రెడ్డి అన్నారు. అలాగే, నగరం చుట్టూ నాలుగు అతిపెద్ద మార్కెట్ యార్డులు రానున్నాయని తెలిపారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం రైతు సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. రైతుకు మేలు చేయడం కోసమే నూతన వ్యవసాయ విధానం తీసుకొస్తున్నామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో మార్కెట్ యార్డులు లేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారని, పటాన్‌చెరు మార్కెట్ యార్డును అత్యంత ఆధునిక హంగులతో రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బాయికాడి హారిక తో పాటు డైరెక్టర్ లు , ఆత్మకమిటి ఛైర్మెన్ గడిలా కుమార్ గౌడ్ వారి బృందం ప్రమాణ స్వీకారం చేశారు.