హైదరాబాద్‌లో రోడ్డెక్కిన పోలీసులు.. నైట్ కర్ఫ్యూ షూరు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రాత్రి కర్ఫ్యూ మంగళవారం రాత్రి మొదలైంది. ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ మొదటిరోజున నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసులు రోడ్లపైకి వచ్చారు. 8 గంటల తర్వాత తెరచి ఉన్న దుకాణాలను మూయించారు. 9 గంటల నుండి […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రాత్రి కర్ఫ్యూ మంగళవారం రాత్రి మొదలైంది. ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ మొదటిరోజున నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసులు రోడ్లపైకి వచ్చారు. 8 గంటల తర్వాత తెరచి ఉన్న దుకాణాలను మూయించారు. 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు ఎవరు ఇండ్ల నుండి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. తొమ్మిది గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులను నిలిపి ప్రశ్నించారు. అత్యవసర విభాగాలకు మాత్రమే అనుమతి ఉందని, ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.