శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

దిశ, వెబ్‎డెస్క్ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయంలోకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‎ఫ్లో 4,01,818 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో 4,96,497 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. ప్రస్తుతం […]

Update: 2020-10-19 20:59 GMT

దిశ, వెబ్‎డెస్క్ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయంలోకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‎ఫ్లో 4,01,818 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో 4,96,497 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. ప్రస్తుతం నీటి నిల్వ 208.72 టీఎంసీలుగా కొనసాగుతోంది.

Tags:    

Similar News